కలమల్ల పోలీసు పై వేటు
ఎర్రగుంట్ల కలమల్ల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శివను ఎస్పీ హర్షవర్ధన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మూడేళ్లగా శివ ఇక్కడ కానిస్టేబుల్ గా పని చేస్తున్నట్లు ఎస్సై తిమోతి తెలిపారు. ఇటీవల దొరసాని పల్లెలో పోలీసులు దాడులు చేసి 17 మందిని జూదరులను అరెస్ట్ చేశారు అందులో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఉన్నతాధికారులు శనివారం అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశారు.