ఈనెల 21న శనివారం ఆర్టీసి సమస్యలపై డయల్ యువర్ ఏ. పి. ఎస్. ఆర్. టి. సి. జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి పి గోపాల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 21వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో జిల్లాలోని ప్రయాణీకులు తమ యొక్క సమస్యలను, సూచనలను సలహాలను 9959225848 అను చరవాణి నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.