కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బి. రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న భాస్కర్ రెడ్డిని సీసీఎస్ కు బదిలీ చేశారు. విజయవాడలోని హ్యుమన్ రైట్ శాఖలో పనిచేస్తున్న రామకృష్ణను కడపకు బదిలీ చేశారు. ఆయన గతంలో జిల్లాలో ఎస్సైగా, సీఐగా పనిచేశారు.