ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొల్యూషన్ బోర్డ్ ఛైర్మన్ గా బాధ్యలు చేపట్టిన రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్యని కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయనను విజయవాడలో కలిశారు. టీడీపీలో మొదటి నామినేటెడ్ పదవిని బీసీ వ్యక్తి కృష్ణయ్యకు కేటాయించడం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర యాదవ్, మంతెన సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.