పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లెకు చెందిన చింతాకు పెద్దక్క (52) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. దీంతో ఆమె భర్త శేఖర్, పిల్లలు నేత్ర దానానికి అంగీకరిస్తూ ఆదివారం నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షుడు రాజుకు సమాచారం ఇచ్చారు. టెక్నీషియన్ హరీశ్తో కలిసి మృతురాలు గ్రామానికి వెళ్లి పార్ధివ దేహం నుంచి కార్నియాలను సేకరించి హైదరాబాద్లో అగర్వాల్ నేత్రనిధికి పంపినట్లు రాజు తెలిపారు.