పులివెందుల పట్టణంలో శుక్రవారం ఉదయం నుంచి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్ల వారుజామున నుంచి ఇంట కల్లాపు చల్లి దేవుని గుడిని సుందరంగా అలంకరించి వరలక్ష్మి దేవి చిత్రపటాలకు, విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి మహిళలకు ఆ ఇంటా వాయనాలు సమర్పించారు. అనంతరం పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంతో పాటు అంకాలమ్మ ఆలయంలోనూ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.