చక్రాయపేట మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారo ఘనంగా నిర్వహించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంతకు ముందు గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో జగన్మోహన్ రెడ్డి పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి మండలం పెద్ద ఎత్తున వైసీపీ నేతలు పాల్గొన్నారు.