అల్లనేరేడు గడ్డు పరిస్థితులను తట్టుకొని భూసారం తక్కువ గల భూముల్లో కూడా పెరుగుతుంది. ఉప్పు, సున్నపు, నీరు నిలబడే సమస్యాత్మక భూముల్లో కూడా వీటిని సాగు చేయవచ్చు. వ్యాపార సరళిలో పెంచుటకు నీరు బాగా ఇంకే గరప, ఒండ్రు నేలలు అనువైనవి. సాధారణంగా నేరేడు విత్తనాలకు నారుపోసి పెంచిన మొక్కలను, అంటుగట్టిన మొక్కలను ఉపయోగించవచ్చు. అయితే నమ్మకమైన వ్యక్తుల నుంచి మొక్కలను కొనుగోలు చేయడం మంచిది.