AP: అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. రుద్రంపేట సమీపంలోని మదర్ థెరిసా కాలనీలో టీడీపీ మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డిపై వైసీపీ నేతలు దాడి చేశారు. రాజకీయ కక్షతో రాడ్లతో దాడి చేయడంతో మోహన్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ నాయకులు సుధాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డిలు, చిన్ని కృష్ణారెడ్డి దాడి చేసినట్లు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.