నాచారంలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఏడాదిగా నాచారంలో ఉంటున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థిని సంజిమ హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ నిర్వాహకులు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.