గుజరాత్‌లోని సూరత్ నగరం సర్దార్ బ్రిడ్జి సమీపంలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ బాలికపై సైకిల్‌పై వెళ్తుండగా 108 అంబులెన్స్ వేగంగా దూసుకొచ్చింది. రెప్పపాటులో బాలికను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆ బాలిక 20 అడుగులు గాల్లోకి ఎగిరి కింద పడింది. స్థానికులు వెంటనే స్పందించి బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలిక చేతికి గాయమైంది. అయితే ప్రాణాపాయం తప్పింది. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.