శ్రీలంక నుంచి స్వస్థలాలకు 13 మంది తమిళ జాలర్లు

78చూసినవారు
శ్రీలంక నుంచి స్వస్థలాలకు 13 మంది తమిళ జాలర్లు
సముద్రంలో తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారన్న అభియోగాలతో శ్రీలంక నావికా దళం ఇటీవల అరెస్టు చేసిన తమిళనాడుకి చెందిన 13 మంది మత్స్యకారులు శుక్రవారం తమ స్వస్థలాలకు పంపించింది. ఈ విషయాన్ని శ్రీలంకలోని భారత దౌత్య కార్యాలయం తెలిపింది. 17 రోజుల తర్వాత వారిని భారత్‌కు రప్పించగలిగామని పేర్కొంది. ఇదివరకు కొలంబో నావికా దళం అరెస్టు చేసినవారిలో 21 మంది భారత మత్స్యకారులను ఈ నెలలో చెనురుకి తిరిగి రప్పించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్