దారుణం.. వ్యక్తిని సజీవ సమాధి చేశాడు

62చూసినవారు
దారుణం.. వ్యక్తిని సజీవ సమాధి చేశాడు
వ్యక్తిని సజీవ సమాధి చేసిన ఘటన హరియాణాలో వెలుగుచూసింది. హర్ దీప్ అనే అతను భార్యతో కలిసి హరియాణాలోని రోహ్‌తక్‌లో అద్దెకు దిగాడు. ఈ క్రమంలో ఇంటి యజమాని అయిన జగదీప్, హర్‌దీప్‌ భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం హర్ దీప్‌కు తెలిసింది. దీంతో తన మిత్రులతో కలిసి జగ్ దీప్‌ను కిడ్నాప్ చేసి తన పొలంలో ఉన్న 7 అడుగుల లోతైన గుంతలో అతడిని సజీవ సమాధి చేశాడు. తర్వాత ఈ విషయం బయటికిరావడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్