పాలస్తీనాను దేశంగా గుర్తించిన 3 దేశాలు (వీడియో)

69చూసినవారు
పాలస్తీనాను అధికారికంగా దేశంగా గుర్తిస్తున్నట్లు ఐర్లాండ్, నార్వే, స్పెయిన్ దేశాలు బుధవారం ప్రకటించాయి. దీంతో పాలస్తీనాకు అంతర్జాతీయంగా మరింత మద్దతు దక్కినట్లు అయింది. పాలస్తీనాకు ఇది చారిత్రాత్మకమైన రోజు అని ఐర్లాండ్ ప్రధాని సైమన్ హారిస్ అన్నారు. దీనిపై పాలస్తీనా హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ మూడు దేశాల నిర్ణయంపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో తమ రాయబారులను వెనక్కి పిలిచింది.

సంబంధిత పోస్ట్