ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. మల్టీప్లెక్స్‌లలో లైవ్

82చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. మల్టీప్లెక్స్‌లలో లైవ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఆదివారం(9న) భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రికెట్ ప్రియులకు మల్టీప్లెక్స్‌లు గుడ్‌న్యూస్ చెప్పాయి. ఈ మ్యాచ్‌ను నగరంలోని ప్రజలకోసం మల్టీప్లెక్స్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటికే బుక్‌మై‌షోలో టికెట్స్ సైతం అందుబాటులో ఉంచారు. భారత్ మ్యాచ్‌లు ఇలా మల్టీప్లెక్స్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి.

సంబంధిత పోస్ట్