'నేను కూడా బీఫ్ తింటా': రాష్ట్ర బీజేపీ చీఫ్

6100చూసినవారు
'నేను కూడా బీఫ్ తింటా': రాష్ట్ర బీజేపీ చీఫ్
ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేఘాలయ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మావ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘాలయలో బీఫ్ తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. తాను కూడా బీఫ్ తింటానని మావ్రీ చెప్పారు. రాష్ట్రంలో అందరూ బీఫ్ తింటారని, దీనికి ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ అని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మావ్రీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you