5 దశల్లో 50 కోట్ల మంది ఓటేశారు: ఈసీ

74చూసినవారు
5 దశల్లో 50 కోట్ల మంది ఓటేశారు: ఈసీ
తొలి 5 దశల ఎన్నికల్లో 76.41 కోట్ల మందికిగాను 50.72 కోట్ల మంది ఓటు వేసినట్లు ఈసీ తెలిపింది. ఏప్రిల్ 19న 102 ఎంపీ స్థానాల్లో 11 కోట్లు, 26న 88 పార్లమెంట్ సీట్లలో 10.58 కోట్లు, మే 7న 94 స్థానాల్లో 11.32 కోట్లు, 13న 96 సీట్లలో 12.25 కోట్లు, 20న 49 సెగ్మెంట్లలో 5.57 కోట్ల ఓట్లు నమోదయ్యాయని వెల్లడించింది. గణాంకాల వెల్లడిలో ఆలస్యం లేదని, పోలింగ్ సమాచారం ఎప్పటికప్పుడు యాప్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్