ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్: రాహుల్ గాంధీ

53చూసినవారు
ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘మన దేశంలో మహిళల జనాభా 50 శాతం.. హయ్యర్ సెకండరీ, ఉన్నత విద్యల్లోనూ మహిళల ఉనికి 50 శాతం.. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలోనూ వారికి సగం వాటా దక్కాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది’ అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్