క్రికెట్ ఆడుతూ విద్యుత్​ షాక్​తో ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడు మృతి

72చూసినవారు
క్రికెట్ ఆడుతూ విద్యుత్​ షాక్​తో ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడు మృతి
క్రికెట్ ఆడుతూ విద్యుత్​ షాక్​తో 13 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన ఢిల్లీలోని రన్ హోలా ప్రాంతంలోని కోట్లా విహార్ ఫేజ్-2లో చోటుచేసుకుంది.ఆట జరుగుతున్న సమయంలో బాలుడు బంతిని తీసుకురావడానికి వెళ్లగా.. గ్రౌండ్ లో ఓ మూల ఉన్న గోశాలకు కరెంట్ వైర్ ఇనుప స్తంభానికి అటాచ్ అయ్యి ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్