'2024 ON' అనే 720 అడుగుల వ్యాసంతో ఉన్న భారీ గ్రహశకలం గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. ఈ గ్రహశకలం సెప్టెంబర్ 15వ తేదీన (ఆదివారం) భూమికి అతి సమీపంగా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహ శకలాన్ని మొదట అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన 'నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ అబ్జర్వేషన్స్ ప్రోగ్రామ్' గుర్తించింది. అప్పటి నుంచి ఈ శకాలన్ని నిశితంగా గమనిస్తున్నారు.