ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు: CBN

34940చూసినవారు
ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు: CBN
AP: ఇకపై బ్యూరోక్రాట్స్‌ పాలన ఉండ‌ద‌ని, రాజకీయ పాలన ఉంటుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. "మీరు మారిన చంద్రబాబును చూస్తారు. బ్యూరోక్రాట్స్‌ పాలన ఉండదు. ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి. బిజీగా ఉన్నా మీతో మాట్లాడుతా. నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు. కత్తి.. మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు. ఎంపీలంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో పనిచేయాలి." అని గెలిచిన ఎంపీల‌తో చంద్ర‌బాబు అన్నారు.

సంబంధిత పోస్ట్