ఆహారం కోసం వెతుకులాడుతూ పైపులోకి తల పెట్టిన కుక్క మూడు రోజులు నరకయాతన అనుభవించింది. తెలంగాణలోని హనుమకొండలో ఈ ఘటన జరిగింది. శ్యామల దుర్గాదాస్ కాలనీలో ఓ కుక్క మూడు రోజుల కిందట రోడ్డు పక్కన ఉన్న ఓ ప్లాస్టిక్ పైపులో తల దూర్చింది. తల అందులోనే ఇరుక్కుపోవడంతో అవస్థలు పడింది. దీంతో కాలనీ వాసులు నగరపాలక సంస్థ అధికారులకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది, డాక్టర్ వచ్చి కుక్కకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. పైపును కోసి ఇర్కుక్కుపోయిన తలను బయటకు తీశారు.