మథురలోని శ్రీకృష్ణజన్మభూమి-షాహీ ఈద్గా మసీదు కేసులో ముస్లింపక్షానికి అలహాబాద్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హిందు పక్షంవేసిన 18 పిటిషన్లకు విచారణార్హత ఉందని ధర్మాసనం చెప్పింది. ఔరంగజేబు కాలంలో ఆలయాన్ని పడగొట్టి మసీదు నిర్మాణం జరిగింది కాబట్టి, కృష్ణజన్మభూమి ఆలయం పక్కన ఉన్న ఈద్గా మసీదును తొలగించాలని హిందువుల తరపున పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని మసీదు నిర్వహణ కమిటీ, యూపీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు సవాల్ చేశాయి.