భారత్‌లో మంకీపాక్స్ అనుమానిత కేసు

61చూసినవారు
భారత్‌లో మంకీపాక్స్ అనుమానిత కేసు
విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న ఓ యువకుడిలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు కనిపించాయి. దీంతో ఆ యువకుడిని అధికారులు ఆసుపత్రికి తరలించి, ఐసోలేట్ చేశారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఆ యువకుడి నుంచి డాక్టర్లు శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. యువకుడికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచారు.

సంబంధిత పోస్ట్