బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సావో పాలోలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 70 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ విమానం కాస్కావెల్ (PR) నుండి Guarulhos (SP)కి వెళుతున్నట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రత్యక్ష సాక్షుల వీడియోల ప్రకారం.. విమానం గాల్లో చక్కర్లు కొడుతూ నేలను తాకింది. దీనికి సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.