అయోధ్యలో శాకాహార సెవెన్ స్టార్ హోటల్: సీఎం యోగి

2943చూసినవారు
అయోధ్యలో శాకాహార సెవెన్ స్టార్ హోటల్: సీఎం యోగి
అయోధ్యలో సెవెన్ స్టార్ హోటల్ నిర్మిస్తామని, దానిలో శాకాహారం అందిస్తామని యూపీ సీఎం యోగి తెలిపారు. అలాగే ప్రతీయేటా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఉత్సవం నిర్వహిస్తామని అన్నారు. అయోధ్యలో హోటళ్ల ఏర్పాటుకు సంబంధించి 25కు పైగా ప్రతిపాదనలు వచ్చాయన్నారు. అయోధ్యకు దేశంలోని నలుమూలల నుంచి రోడ్డు, విమాన, రైలు కనెక్టివిటీ ఏర్పడిందన్నారు. వీధి వ్యాపారుల వ్యాపార నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్