నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైనుంచి పడి వాచ్‌మెన్‌ మృతి

574చూసినవారు
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైనుంచి పడి వాచ్‌మెన్‌ మృతి
నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి పడి వాచ్‌మెన్‌ మృతి చెందాడు. ఈ ఘటన ఓల్డ్ అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్పేటకు చెందిన జి.కోటయ్య (55) ఓల్డ్ అల్వాల్ పరిధి సూర్య నగర్ లోని శ్రీబాలాజీ ఎన్‌క్లేవ్ లో నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్‌మెన్‌ గా పని చేస్తున్నాడు. మూడో అంతస్తులో నిర్మించిన గోడలకు నీరు పడుతుండగా కాలు జారి రెండో అంతస్తులో పడి మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్