సెల్ఫ్‌ డ్రైవ్‌ పేరుతో మోసం చేసి 21 కార్లతో పరారైన మహిళ అరెస్ట్‌

68చూసినవారు
సెల్ఫ్‌ డ్రైవ్‌ పేరుతో మోసం చేసి 21 కార్లతో పరారైన మహిళ అరెస్ట్‌
సెల్ఫ్‌ డ్రైవ్‌ పేరుతో ఓనర్ల వద్ద కార్లు అద్దెకు తీసుకుని అద్దె చెల్లించకుండా మోసం చేసి 21 కార్లతో పరారైన మహిళను రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉష అనే మహిళ మల్లేశ్‌ అనే వ్యక్తి సహాయంతో సెల్ఫ్‌ డ్రైవ్‌ కోసం అద్దెకు కార్లు సేకరించి.. వాటిని కర్ణాటకలోని సాగర్‌, అనిల్‌తో కలిసి నంబర్‌ ప్లేట్లు, ఆర్‌సీలు మార్చి బీదర్‌తో పాటు మహారాష్ట్రలో అద్దెకు తిప్పారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు వారిని అరెస్టు చేసి మొత్తం 21 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్