కొత్త రాతియుగానికి చెందిన సమాధుల దిబ్బ ఒకటి స్పెయిన్‌లో వెలుగు చూసింది. 5,600 ఏళ్ల నాటి ఈ కట్టడంలో అత్యంత భారీ పరిమాణంలో ఉన్న 32 ఏక శిలలను ఉపయోగించడం విశేషం! అవి ఒక్కోటీ కనీసం రెండు జెంబో జెట్ విమానాలంత తూగుతాయట. వీటిలో అతి పెద్ద రాయి అయితే ఏకంగా 150 టన్నుల బరువుంది. ఇది అతి పెద్ద జీవి అయిన నీలి తిమింగలం బరువుతో సమానం. ఇక 32 రాళ్లూ కలిపి 1,140 టన్నులుంటాయట. ఇవి సగటున 25 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి.