ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వాచ్‌మెన్‌పై ఒక్కసారిగా కొన్ని కుక్కలు దాడికి దిగాయి. దీంతో వాచ్‌మెన్ వాటిని కర్రతో బెదిరించడంతో.. అక్కడే ఉన్న కుక్కల యజమాని వాచ్‌మెన్‌పై దాడికి చేశాడు. కర్రతో బెదిరించినందుకు అతడిని కొట్టాడు. అక్కడే ఉన్న కొంతమంది చూసి యువకుడిని మందలించారు. ఈ ఘటన అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీలో రికార్డు అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కుక్కల కంటే వాటి యజమానులే ప్రమాదకరమని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.