మద్యం మత్తులో ఎద్దుపై సవారీ చేసిన యువకుడు.. వీడియో వైరల్

69చూసినవారు
మద్యం మత్తులో ఓ యువకుడు ఎద్దుపై సవారీ చేస్తూ హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రిషికేష్‌కు చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఎద్దుపై సవారీ చేస్తూ తపోవన్‌ ప్రాంతంలో వీధుల్లో హల్‌చల్‌ చేశాడు. యువకుడు అలా ఎద్దుపై స్వారీ చేస్తుండగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఉత్తరాఖండ్‌ పోలీసులు యువకుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్