AP: రాష్ట్రంలో అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి పురపాలకశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల్లోకి వచ్చేలా చూడాలని, నిర్మాణం పూర్తయ్యే వరకు ప్లాన్ ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలి’ అని పేర్కొంది. డీవియేషన్ ఉన్న నిర్మాణాలకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇస్తే చర్యలు తప్పవంది. నివాసయోగ్య ధ్రువపత్రం ఇస్తేనే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు, లోన్లు ఇవ్వాలని స్పష్టం చేసింది.