ఏసీపీ ఉమా మహేశ్వరరావు అరెస్ట్‌

83చూసినవారు
HYD: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమా మహేశ్వరరావు అరెస్ట్‌ చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు. ఏసీపీ ఉమాపై అభియోగాలు వచ్చాయని.. ఈ క్రమంలో తనిఖీ చేయగా 17 చోట్ల స్థిర, చరాస్తులను గుర్తించామని చెప్పారు. అంతేకాకుండా ఘట్‌కేసర్‌లో 5 ఇళ్ల స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. రూ. 38 లక్షలు నగదు, 60 తులాల బంగారం సీజ్ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ. 3 కోట్లకుపైగా ఉంటుందన్నారు. అలాగే రెండు లాకర్లను గుర్తించామని.. శామీర్‌పేటలో ఒక విల్లా గుర్తించినట్లు చెప్పారు. బుధవారం ఉమామహేశ్వరరావును కోర్టులో ప్రవేశ పెడతామన్నారు.

సంబంధిత పోస్ట్