అత్యాచార కేసులో అరెస్టయిన మలయాళ నటుడు సిద్ధిఖీ బెయిల్‌పై విడుదలయ్యారు. గంటల వ్యవధిలోనే ఆయనకు బెయిల్ వచ్చింది. నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో సిద్ధిఖీని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.