IDFC ఫస్ట్ బ్యాంక్ కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టింది. బ్యాంక్‌కు వచ్చే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఏఐ పవర్డ్ హోలోగ్రాఫిక్ డిజిటల్ అవతార్‌ను ప్రవేశపెట్టింది. బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ రూపంతో ఈ అవతార్‌ను క్రియేట్ చేసింది. హోలోగ్రాఫిక్ డిజిటల్ అవతార్ అనేది ఒక వ్యక్తి లేదా పాత్రకు త్రీడి (3D) వర్చువల్ రూపం. ముంబయిలోని జుహు బ్రాంచ్‌లో తొలుత ఈ సేవల్ని ప్రారంభించారు.