వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను మంత్రి శ్రీధర్‌బాబు సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ కావ్య భేటీ అయ్యారు. మెగాటెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులపై సమీక్షించారు. అనంతరం టెక్స్‌టైల్ పార్క్ భూ నిర్వాసితులకు డ్రా పద్ధతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. మొత్తం 863 మంది లబ్ధిదారులకు మంత్రి శ్రీధర్‌బాబు ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు.