కేరళ రాష్ట్రంలోని మూడంచెల పంచాయతీలు, మున్సిపల్ సంస్థలకు అదనంగా రూ.211 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ శనివారం ప్రకటించారు. ప్రజా అవసరాల కోసం వినియోగించే జనరల్ పర్పస్ ఫండ్‌లో ఒక విడత ఇప్పటికే కేటాయించబడింది. గ్రామ పంచాయతీలకు రూ.150 కోట్లు, బ్లాక్ పంచాయతీలకు 10 కోట్లు, జిల్లా పంచాయతీలకు 7 కోట్లు, మున్సిపాలిటీలకు 26 కోట్లు, కార్పొరేషన్లకు 18 కోట్లు కేటాయించారు.