102 వాహన డ్రైవర్ కు తీవ్ర గాయాలు

84చూసినవారు
102 వాహన డ్రైవర్ కు తీవ్ర గాయాలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 102 వాహన డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. డ్యూటీలో చేరేందుకు మండలంలోని బెల్గాం నుండి ఆదిలాబాద్ వైపు ద్విచక్ర వాహనంపై శుక్రవారం వస్తున్న 102 వాహన డ్రైవర్ ఋషి కుమార్ వాహనాన్ని తరణం -నిరాల గ్రామాల మధ్య పశువు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఋషి కుమార్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహన సిబ్బంది ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్