ఆటో, బైకు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన ఆసిఫాబాద్ మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం. ఆసిఫాబాద్కి చెందిన ప్యాసింజర్ ఆటో బూరుగుడా వైపు వెళుతూ. గుండి చౌరస్తా సమీపంలో ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న కోటేశ్వర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్తానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.