అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి

63చూసినవారు
అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి
మందమర్రి పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో అక్రమంగా నిర్మాణం చేపట్టిన వ్యాపార సముదాయాల నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బీఎస్పి చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కోరారు. ఈ మేరకు కమిషనర్ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. పార్కింగ్ కు ఉంచాల్సిన దారులను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. నిర్మాణాలు తొలగించి ప్రజలకు దారి సౌకర్యం కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్