చిరుత పులి దాడిలో గాయపడ్డ మహిళను పరామర్శించిన డీఎఫ్ఓ

52చూసినవారు
చిరుత పులి దాడిలో గాయపడిన బజార్హత్నూర్ మండలానికి చెందిన అర్క భీమాబాయిని ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖాధికారి బాజీరావు పాటిల్ శనివారం పరామర్శించారు. స్థానిక రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించి చిరుత పులి దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటవీశాఖ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణ సాయం కింద రూ. 6వేలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్