అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ అధికారులతో, రైతులతో కలిసి రుణ మాఫీ గూర్చి జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడారు. మాకు ఇంకా రైతు రుణమాఫీ రాలేదు అని తెల్పడంతో అందరికీ వస్తాయి అధైర్య పడవద్దు అని రైతులకు సూచించారు.