కోటపల్లి మండలంలోని కాపర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన తలండి శ్రావణ్ కుమార్ అనే యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందాడు. బుధవారం స్నానం చేసేందుకు చెరువుకు వెళ్లిన శ్రావణ్ కుమార్ గల్లంతయ్యాడు. మరుసటి రోజు జాలర్లతో వెతకగా మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.