కాగజ్‌నగర్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్ ఎదురుగా సోమవారం ఐచర్ వ్యాన్, బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు. మృతి చెందిన యువకుడు స్థానిక ఓల్డ్ కాలనీ ఫోటోగ్రాఫర్ జీవన్ గా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.