హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు

57చూసినవారు
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు
మంచిర్యాలలో హత్యాయత్నం కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు సిఐ బన్సీలాల్ తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్ లో ఈనెల 24న ఆత్మకూరు సంజీవ్ పై హత్యాయత్నం చేసిన నిందితుల్లో ఒకరైన బొక్కలుగుట్ట శ్రీధర్ ను మంచిర్యాల ఎసిసిలో పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద ఒక కత్తిని కూడా స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచినట్లు సిఐ వివరించారు.

సంబంధిత పోస్ట్