మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భగవంతంవాడకు చెందిన కొండపల్లి సంగీత (30) అనే మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. సంగీత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని, మృతికి గల కారణాలు తెలియ రాలేదని జిఆర్పి ఎస్ఐ మహేందర్ తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని మార్చురి గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. సంగీతకు భర్త రమేష్, ఇద్దరు పిల్లలు ఉన్నారు.