మెగా రక్తదాన శిబిరానికి సహకరించాలి

67చూసినవారు
మెగా రక్తదాన శిబిరానికి సహకరించాలి
హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ పి. వెంకటరాములును గురువారం లయన్స్ క్లబ్ మంచిర్యాల సీనియర్ సభ్యులు వి. మధుసూదన్ రెడ్డి, వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి అక్టోబర్ 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి బెటాలియన్ నుండి రక్తదాతలను సమకూర్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్