శ్రీరాంపూర్ ఏరియాలోని సుభాష్ నగర్ కు చెందిన సుగుణ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది. ఇంట్లోనే నిద్ర మాత్రలు మింగడంతో కొద్ది సేపటికి గుర్తించి కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్థల వివాదంలో మనస్థాపంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.