ఆర్టీసీ బస్సు.. బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

62చూసినవారు
ఆర్టీసీ బస్సు.. బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం భైంసాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తానుర్ మండలం ఎల్వి గ్రామానికి చెందిన రాజేష్ బైక్ పై బైంసాకు వస్తున్నాడు. భైంసా నుండి నాందేడ్ కు వెళ్తున్న భైంసా డిపో ఆర్టీసీ బస్సు పాత చెక్పోస్ట్ వద్ద ఎదురెదురుగా ఢీకొనడంతో రాజేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్