భైంసా పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ గా నూతనంగా నియమితులైన ఇన్స్పెక్టర్ గోపినాథ్ శుక్రవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా భైంసా సమస్యలపై చర్చించారు. కాగా గోపీనాథ్ గతంలో హైదరాబాద్ లోని కూకట్ పల్లి (కెపిహెచ్పి), శంకర్ పల్లి, సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ లో విధులు నిర్వహించారు. తాజాగా బైంసాకు బదిలీపై వచ్చారు.